భారతదేశం, డిసెంబర్ 18 -- జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది బ్యూటిపుల్ ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో చిట్టిగా తెలుగు యువతను తెగ అట్రాక్ట్ చేసింది. ఫరియా అబ్దుల్లా తాజాగా నటించిన సినిమా గుర్రం పాపిరెడ్డి. డార్క్ కామెడీ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో నరేష్ అగస్త్య హీరోగా చేశాడు.

డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) గుర్రం పాపిరెడ్డి సినిమాను నిర్మించారు. ఈ మూవీకి డైరెక్టర్ మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. గుర్రం పాపిరెడ్డి డిసెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా డిసెంబర్ 17న గుర్రం పాపిరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పింది.

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. "ఈ సినిమాలో సౌధామి...