భారతదేశం, నవంబర్ 16 -- టాలీవుడ్‌లో త్రినాధ్ కఠారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ మూవీ ఇట్లు మీ ఎదవ. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత బళ్లారి శంకర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ మూవీలో సాహితీ అవాంచ హీరోయిన్‌గా చేసింది.

వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లు అనే ట్యాగ్ లైన్‌తో వచ్చిన ఇట్లు మీ ఎదవ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఇట్లు మీ ఎదవ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 21న ఇట్లు మీ ఎదవ థియేట్రికల్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది.

నైజాంలో ఇట్లు మీ ఎదవ సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పీ విడుదల చేయనుండగా.. ఆంధ్ర, సీడెడ్‌లో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేయనుంది. ఈ రెండు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఇట్లు మీ ఎదవ గ్రాండ్‌...