Telangana,hyderabad, ఆగస్టు 24 -- తెలంగాణలో డిగ్రీ ప్రవేెశాల ప్రక్రియ తుది దశకు చేరింది. ఇప్పటికే ప్రత్యేక విడత ప్రవేశాలు కూడా ముగియగా. స్పాట్ అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇవాళ్టి నుంచి సెకంజ్ ఫేజ్ ఇంటర్నల్ స్లైడింగ్ కు అవకాశం కల్పించారు.

సెంకడ్ ఫేజ్ ఇంటర్నల్ స్లైడింగ్ లో భాగంగా విద్యార్థులు ఇవాళ, రేపు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. వీరికి ఆగస్ట్ 26వ తేదీన సీట్లను కేటాయిస్తారు. అలాట్ మెంట్ కాపీని https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మరోవైపు రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లోనూ స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నారు. ఇప్పటి వరకు ప్రైవేట్‌ కళాశాలల్లో మాత్రమే స్పాట్‌ అడ్మిషన్లకు అవకాశం ఉండేది. తాజాగా ప్రభుత్వ కాలేజీల్లోనూ స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించారు.

Published by HT Digital Content Services wit...