భారతదేశం, జనవరి 15 -- చాలామంది గుండె ఆరోగ్యం అనగానే కేవలం వ్యాయామం, కొలెస్ట్రాల్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ, రక్తంలో చక్కెర స్థాయిలు (Blood Sugar) గుండెకు 'నిశ్శబ్ద శత్రువు'లా మారుతాయని మనకు తెలియదు. మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ కాకముందే.. పెరిగిన చక్కెర స్థాయిలు గుండె ధమనులను దెబ్బతీయడం ప్రారంభిస్తాయి. అయితే, ప్రాథమిక దశలోనే జాగ్రత్త పడితే ఈ ప్రమాదాన్ని పూర్తిగా తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిస్‌ను ప్రారంభంలోనే నియంత్రించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూణేలోని సహ్యాద్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రియా పాలింకర్ కీలక విషయాలను పంచుకున్నారు.

"మధుమేహం వచ్చిన కొత్తలో, ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ అయిన మొదటి కొన్ని ఏళ్లలోనే దానిని క్రమబద్ధంగా అదుపులో ఉంచుకోగలిగితే.. భవిష్యత్తులో గుండె జబ్బులు...