భారతదేశం, ఆగస్టు 23 -- డయల్ 112 ఎమర్జెన్సీ సేవలను మూడు విభాగాలతో కలపనున్నారు. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ పి.వెంకట రమణ ఈ విషయాన్ని వెల్లడించారు. డయల్ 112 అత్యవసర సేవను త్వరలో రాష్ట్రంలోని పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సేవలతో అనుసంధానించనున్నట్లు తెలిపారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో ఈ మూడు విభాగాలు సమన్వయంతో స్పందించే అవకాశం కలుగుతుంది.

రెండు దశాబ్దాల తర్వాత పరికరాల ఆధునీకరణ, కొత్త వాహనాల కొనుగోలుతో సహా, ఈ విభాగంలో చేపడుతున్న భారీ సంస్కరణల్లో భాగంగానే ఈ చర్య తీసుకుంటున్నారు అధికారులు. అనంతపురంలో పర్యటించిన సందర్భంగా కొత్త అగ్నిమాపక వాహనాలను, అత్యాధునిక అగ్నిమాపక పరికరాలను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వేగవంతమైన స్పందన, ఆధునిక పరికరాల వినియోగం(ఇరుకైన ప్రాంతాల్లో కార్యకలాపాల కోసం ప్ర...