భారతదేశం, జూలై 23 -- మనం చేసే ప్రతి మంచి చెడుకూ తగిన ఫలితాన్ని అనుభవించాల్సిందే. జీవిత ప్రయాణంలో మనిషి ఎడుగుతున్న కొద్దీ ఎంతోమంది పరిచయం అవుతారు. అనేకమందిని మిత్రులుగా చేసుకుంటాం. కానీ అందరూ ఆఖరి వరకు తోడుగా ఉంటారనే గ్యారెంటీ లేదు. ప్రాణం పోయే సమయమైనా సరే వెన్నంటి ఉండే నిజమైన స్నేహితులు కొందరే ఉంటారని ఆచార్య చాణక్యుడు స్పష్టం చేశారు. జీవితంలోని క్లిష్ట పరిస్థితుల్లోనూ మనిషికి అసలైన రక్షణగా నిలిచే ఆ నాలుగు ముఖ్యమైన మిత్రుల గురించి చాణక్య నీతిలో వివరంగా చెప్పబడింది.

మానవ జీవితంలో ఎదురయ్యే రకరకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆచార్య చాణక్యుడు అందించిన ఈ మార్గదర్శకాలు నేటి ఆధునిక కాలానికి కూడా వంద శాతం సరిగ్గా సరిపోతాయి. మనిషి ప్రయాణించే తీరును బట్టి, ఎదుర్కొనే సమస్యలను బట్టి అసలైన బలం ఏమిటో ఈ సూత్రాలు వివరిస్తాయి.

చాణక్యుడు జీవిత సత్యాలను కళ్లకు...