భారతదేశం, జూన్ 4 -- డబుల్ రాజయోగాల ధమాకా: జ్యోతిష్య శాస్త్రంలో రాజయోగాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. గ్రహాల నడక మారినప్పుడల్లా కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలోనే జూన్ నెలలో రెండు అత్యంత శక్తివంతమైన రాజయోగాలు సాకారం కాబోతున్నాయి. ప్రస్తుతం జూన్ 4వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు అంత్యంత పవిత్రమైన 'గజకేసరి రాజయోగం' నడుస్తోంది. జాతకంలో చంద్రుడికి కేంద్ర స్థానంలో (1, 4, 7, 10 ఇళ్లలో) గురు గ్రహం ఉన్నప్పుడు ఈ గజకేసరి యోగం ఏర్పడుతుంది. అలాగే చంద్రుడు నీచ స్థానంలో లేకుండా, అస్తమించకుండా ఉండి.. శుక్ర, బుధ, గురు గ్రహాల వీక్షణం ఉన్నప్పుడు కూడా ఈ అద్భుత యోగం పడుతుంది.

"గజకేసరి యోగంలో జన్మించిన వారు లేదా ఈ యోగ ప్రభావం ఉన్న కాలంలో వ్యక్తులు శత్రువులపై విజయం సాధిస్తారు. వీరి మాటతీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రాచరికపు సుఖాలు...