భారతదేశం, ఆగస్టు 6 -- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. మొత్తం 34 కీలక అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన క్యాబినెట్, రాష్ట్ర అభివృద్ధి, పాలనా సంస్కరణలకు బాటలు వేసే పలు బిల్లులు, పాలసీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించింది. అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ ప్రాజెక్టుకు రూ.1,002.49 కోట్లు కేటాయించేందుకు క్యాబినెట్ సమ్మతించింది. ఈ నిర్మాణ బాధ్యతలను ప్రముఖ సంస్థ ఎల్‌అండ్‌టీకి అప్పగించాలని నిర్ణయించారు.

అసెంబ్లీ, హైకోర్టు భవనాల నూతన డిజైన్ల కోసం అదనపు నిధుల కేటాయింపునకు ఆమోదం లభించింది. అమరావతి ఐ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త...