భారతదేశం, ఆగస్టు 1 -- కేరళలోని చంగనస్సేరిలో జరిగిన ఒక పెళ్లి.. చాలా భిన్నంగా, ప్రపంచంలో ఎక్కడా చూడని అరుదైన సన్నివేశంతో వార్తల్లో నిలిచింది. ఈ వివాహ వేడుకలోని ప్రధాన పాత్రలన్నీ కవలలే కావడం విశేషం. అంటే.. వధూవరులు ట్విన్సే, పెళ్లి జరిపించిన వారు ట్విన్సే!

గురువారం నాడు చంగనస్సేరి మెట్రోపాలిటన్ చర్చీలో ఈ విచిత్రమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. వరుడు అఖిల్ కే. థామస్ చెయ్యి పట్టుకుని వధువు మ్యాగి మేరీ థామస్ నిలబడగా.. అఖిల్ కవల సోదరుడు నిఖిల్ కే. థామస్ పక్కన, మ్యాగి కవల సోదరి మరియా మేరీ థామస్ నిలబడింది.

ఇక ఈ పెళ్లి వేడుకను జరిపించిన ఫాదర్లు (పురోహితులు) కూడా కవల సోదరులే కావడం, వారికి సహాయకులుగా (అల్తార్ బాయ్స్) వ్యవహరించిన ఇద్దరు బాలురు కూడా కవలలు కావడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు.

ఇలా.. రెండు కుటుంబాలకు ఇది కేవలం పెళ్లి మాత్రమే ...