భారతదేశం, నవంబర్ 16 -- తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న గుండు వాణిపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. విధుల్లో ఉంటూ అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు ఆమె నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, సన్నిహితులు, బినామీలకు చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

ఏసీబీ అధికారుల ప్రాథమిక తనిఖీల్లో గుండు వాణి, ఆమె కుటుంబ సభ్యుల పేరిట ఉన్న పలు విలువైన స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. ప్రభుత్వ రికార్డుల విలువ ప్రకారం వీటి విలువ కోట్లలో ఉండగా, బహిరంగ మార్కెట్ విలువ ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది.

రెండు ఓపెన్ ప్లాట...