భారతదేశం, మే 20 -- తెలంగాణలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(GCC) ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థల నుంచి పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ మహానగరానికే పరిమితం కాకుండా జిల్లాలకు కూడా విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ అవతలి ప్రాంతంలో కూడా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసేలా ప్రత్యేకంగా జీసీసీ పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ హైవేల వెంట జీసీసీలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసేలా ఆయా సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఐటీ, పరిశ్రమల శాఖ సంబంధిత అంశాలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఐటీ, ఇతర ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ద...