భారతదేశం, జనవరి 22 -- ఆంధ్రప్రదేశ్‌లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు మరిచిపోకముందే.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో బస్సులో ఉన్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..

నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెళ్తోంది. ఇందులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శిరివెళ్లమెట్ట దగ్గరకు బస్సు వచ్చింది. ఈ సమయంలో బస్సు టైరు పేలింది. అంతేకాదు అదుపుతప్పి డివైడర్ దాటి అవతలివైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే బస్సుకు మంటలు వ్యాపించాయి. ఆ దారిలో వెళ్తున్న డీసీఎం డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. బస్సు అద్దాలను పగలగొట్టారు. దీంతో ప్రయాణికులు ప్రా...