భారతదేశం, అక్టోబర్ 3 -- బిగుతుగా ఉండే దుస్తులు, సరైన సైజు లేని బ్రాలు ధరిస్తే రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) బారిన పడే ప్రమాదం ఉందనే వార్తలు తరచూ సోషల్ మీడియా వేదికలపై చక్కర్లు కొడుతుంటాయి. రోజంతా బిగుతైన బ్రా వేసుకోవడం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి క్యాన్సర్‌కు దారితీస్తుందని చాలామంది భావిస్తుంటారు. అయితే, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని వైద్య నిపుణులు తేల్చి చెప్తున్నారు.

ముంబైలోని ఎంఓసీ క్యాన్సర్ కేర్ వైద్యురాలు డాక్టర్ సీమా జగ్యాసీ ప్రకారం, బిగుతైన బ్రా ధరించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. "లింఫాటిక్ వ్యవస్థ అనేది బ్రా బిగుతుగా ఉన్నంత మాత్రాన మూసుకుపోయే డ్రైనేజీ పైపు కాదు" అని ఆమె స్పష్టం చేశారు.

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ కూడా బ్రా వినియోగానికి, రొమ్ము క్యాన్సర్ ముప్పునకు ఎలాంటి సంబంధం లేదని ...