భారతదేశం, మార్చి 12 -- నిన్నటివరకు ఏ సినిమా కావాలన్నా టెలిగ్రామ్‌లో వెతుక్కునే వారికి ఇప్పుడు పెద్ద షాక్ తగలనుంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ (MIB) ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఓటీటీ సంస్థలు, సినిమా నిర్మాతల ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం మార్చి 11న టెలిగ్రామ్‌కు ఒక నోటీసు పంపింది. ఇందులో 120 పేజీల అనుబంధం (Annexure) ఉంది. అందులో పైరసీకి పాల్పడుతున్న ఛానళ్ల లింకులు, పేర్లు, అవి పంచుతున్న సినిమాల వివరాలను ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. నోటీసు అందిన 3 గంటల్లోగా ఆ లింకులన్నింటినీ తొలగించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఈ నిర్ణయం వల్ల పైరసీ ఛానల్స్ నడిపే వారికి మాత్రమే కాదు, వాటిలో కంటెంట్ చూసే వారికి కూడా ఇబ్బందులు తప్పవు. ఛానల్స్ ఆగిపోవడం వల్ల మీరు డౌన్లోడ్ చేసుకున్న లేదా ...