భారతదేశం, జూలై 6 -- ూఎస్‌లోని టెక్సాస్ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. గ్వాడాలుపే నదిలో అకస్మాత్తుగా నీటి ఉధృతి పెరగడంతో అనేక ప్రాంతాల్లో వరద చుట్టుముట్టింది. జనాలు వరదలో చిక్కుకుపోయారు. అధికారుల ప్రకారం.. ఇప్పటివరకు వరదల కారణంగా 52 మందికి పైగా మరణించారు. ఇందులో 15 మంది పిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. క్యాంప్ మిస్టిక్‌లోకి వరద నీరు ప్రవేశించింది. ఈ క్రైస్తవ శిబిరంలోని 27 మంది బాలికలు తప్పిపోయారు. రెస్క్యూ బృందాలు వారి కోసం వెతుకుతున్నాయి. వందలాది మంది ఈ శిబిరంలో ఉన్నారు.

అధికారుల ప్రకారం.. తప్పిపోయిన వారి సంఖ్యను ఇంకా సరిగా అంచనా వేయలేమని చెప్పారు. నదిలో ఇంకా వెతుకుతున్నారు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గ్వాడాలుపే నది నీరు కేవలం 45 నిమిషాల్లో 8 మీటర్లు పెరిగింది. ఇది పరిస్థితిని చాలా దారుణంగా మార్చింది. నది నీరు అకస్మాత్తుగ...