భారతదేశం, నవంబర్ 10 -- Papikondalu Boat Tourism : ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తీపి కబురు అందించింది. ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రసిద్ధ పాపికొండల విహారయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. గత నెల 26వ తేదీన సంభవించిన 'అర్నబ్' తుఫాను తీవ్ర ప్రభావం కారణంగా గోదావరి నదిలో పర్యాటక బోటు ప్రయాణాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

ప్రస్తుతం నదీ పరివాహక ప్రాంతంలో వాతావరణం అనుకూలించడంతో పాటు ప్రవాహం సాధారణ స్థితికి రావడంతో తిరిగి బోటు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.

పోలవరం జిల్లాలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో కొలువుదీరిన పాపికొండలు ప్రకృతి రమణీయతకు నిలయం. పచ్చని అడవులు, ఎత్తైన కొండల నడుమ పరవళ్లు తొక్కే గోదావరి నదిలో సాగే పడవ ప్రయాణం పర్యాటకులకు మైమరిపించే అనుభూతిని అందిస్తుంది. అయితే... అర్...