భారతదేశం, డిసెంబర్ 21 -- ఫిబ్రవరిలో జరగనున్న టీ20 ప్రపంచకప్​ కోసం భారత జట్టును శనివారం ప్రకటించారు. స్క్వాడ్​లో యంగ్​ స్టార్​ ఓపెనర్​ శుభ్​మన్​ గిల్​ లేకపోవడం ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శనివారం టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించినప్పుడు కాదు, బుధవారం పొగమంచు కారణంగా నాలుగో టీ20 మ్యాచ్ రద్దయినప్పుడే గిల్ భవితవ్యం ఖరారైపోయిందని క్రికెట్​ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, జట్టు నుంచి తప్పిస్తున్నారనే విషయాన్ని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గానీ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గానీ, కోచ్ గౌతమ్ గంభీర్ గానీ గిల్‌కు ముందు చెప్పలేదని నివేదికలు వెలువడుతున్నాయి. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గత ఏడాది కాలంగా గిల్ ఆటతీరు అంతంతమాత్రంగానే ఉన్నా, జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న అతడిని తప్పించిన తీరు మాత్రం చర్చకు దారితీస్తో...