భారతదేశం, ఫిబ్రవరి 12 -- దేశీయ స్టాక్ మార్కెట్లో ఐటీ షేర్లు కుప్పకూలాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోవడంతో ఐటీ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా క్షీణించింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఒక్కరోజే 4.6 శాతం పతనమై 33,471 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. దీంతో ఐటీ ఇండెక్స్ విలువ రూ. 28.9 లక్షల కోట్ల నుంచి రూ. 27.6 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇన్వెస్టర్లు సుమారు రూ. 1.3 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు.

2026 ప్రారంభం నుంచి ఐటీ రంగానికి కాలం కలిసిరావడం లేదు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఐటీ ఇండెక్స్ సుమారు 11 శాతం నష్టపోయింది. కేవలం గత నెల రోజుల్లోనే 12 శాతం మేర పతనం కావడం ఇన్వెస్టర్ల ఆందోళనను పెంచుతోంది.

మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఐటీ పతనానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.

1. ఏఐ (AI) భయాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలి...