టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్‌కు బ్రేక్! పరిశోధనల్లో ఆశ్చర్యకర విషయాలు
భారతదేశం, జూలై 9 -- వయసు పైబడే కొద్దీ వేధించే అతిపెద్ద సమస్య మతిమరుపు. దశాబ్దాలుగా అల్జీమర్స్ వ్యాధికి పరిష్కారం కనుగొనే క్రమంలో ఎన్నో ఖరీదైన ప్రయోగాత్మక మందులు విఫలమయ్యాయి. అయితే, సరికొత్త ఆశ ఇప్పుడు వందేళ్ల చరిత్ర గల ఒక చవకైన టీకా రూపంలో పుట్టుకొచ్చింది. క్షయ వ్యాధి (TB) నివారణకు వాడే బీసీజీ (BCG) వ్యాక్సిన్, ఇప్పుడు మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఒక శక్తివంతమైన గేమ్ ఛేంజర్‌గా మారుతోంది. 12 నెలల పాటు సాగిన ఒక తాజా పరిశోధన, ఈ పాత వ్యాక్సిన్ మన రోగనిరోధక వ్యవస్థను ఎలా మేల్కొల్పుతుందో వెల్లడించింది. అమెరికాలోని ప్రముఖ మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణులు సంయుక్తంగా నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయ వైద్య జర్నల్ 'కమ్యూనికేషన్స్ మెడిసిన్' ఈ పరిశోధన వివరాలను ప్రచురించింది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.