భారతదేశం, జనవరి 5 -- దేశంలోని వివిధ ప్రాంతాలలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణపై సమగ్ర నివేదికను రూపొందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన అంతర్గత ఆడిట్ సమావేశంలో ఆయన సమీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. టీటీడీ కల్యాణ మండపాలు ఆదరణలో ఎన్ని ఉన్నాయి, ఆదరణ లేనివి ఎన్ని, ఆధునీకరించినవి ఎన్ని, తదితర స్థితిగతులు, భక్తులు సౌకర్యవంతంగా వినియోగించుకోవడానికి సమగ్ర విధానాన్ని రూపొందించి టీటీడీ పాలక మండలికి నివేదించాలని తిరుపతి జేఈవోను ఆదేశించారు. టీటీడీ ఆలయాలలోని తిరువాభరణ రిజిస్టర్లను డిజిటలైజ్ చేసి డాక్యుమెంటను రూపొందించాలన్నారు ఈవో సింఘాల్. అలాగే టీటీడీలోని అన్ని విభాగాలలోని మౌలిక వసతులకు సంబంధించి టూల్స్ అండ్ ప్లానింగ్‌ను ఎప్పటికప...