భారతదేశం, సెప్టెంబర్ 22 -- పరకామణిలో చోరీ వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన హయాంలో తప్పు జరిగిందని నిరూపిస్తే తల నరుక్కుంటానని చెప్పారు. పరకామణిలో చోరీని బయటపెట్టి.. రవికుమార్ నుంచి కోట్ల రూపాయలు రికవరీ చేశామని చెప్పారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో కాక రేపుతోంది. తాజాగా దీనిపై మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. అసెంబ్లీ వద్ద మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.

'టీటీడీ పరకామణి వ్యవహారంలో త్వరలోనే సిట్ వేస్తున్నాం. జగన్ అండ్ టీం దేవుడి దగ్గర నాటకాలు ఆడారు. అందుకే దేవుడు ఏం చేయాలో అది చేశాడు. వైసీపీ హయాంలో పరకామణి దొంగను అరెస్ట్ చేయకుండా 41ఏ నోటీసులు ఇచ్చి పంపించేశారు. ఈ కేసులో అనేక నిజాలు బయటకు రావాల్సి ఉంది. తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయ...