భారతదేశం, డిసెంబర్ 23 -- కొత్తగా వివాహం చేసుకునే పెళ్లి కుమారై, పెళ్లి కుమారుడికి శ్రీ‌వారి దీవెనలతో అక్షింతలు, కుంకుమ, కంకణం, శ్రీవేంకటేశ్వర‌స్వామి, శ్రీపద్మావతీ అమ్మవారి ఫోటోలతో కూడిన ఆశీర్వచనం పత్రిక, 'కల్యాణ సంస్కృతి' పుస్తకం టీటీడీ అందిస్తోంది. ప్రతి ఏడాది శుభ‌లేఖ పంపిన‌ ల‌క్షకు పైగా వ‌ధూవ‌రుల‌కు శ్రీ‌వారి దీవెనలతో క‌ల్యాణం జ‌రుగుతోంది.

నూతన వధువరులు కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇంతటి విశిష్టమైన వివాహానికి కలియుగ వైకుంఠం శ్రీవేంకటేశ్వరుని ఆశీస్సులు అందితే అంతకన్నా కావాల్సిందేముంటుంది చెప్పండి. ఈ మహత్తర అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందిస్తోంది. ఇందుకు చేయాల్సింది పూర్తి చిరునామాతో వివాహ శుభలేఖను పంపాలి.

నవసమాజంలో గృహస్థ ధర్మం కీలకమైనది. వధూవరుల కల్యాణంలో మొదటి ఘట్టంగా కంకణధారణ చేస్తారు. ఉపద్రవాల నుండి ...