భారతదేశం, జనవరి 21 -- రథ సప్తమిపై తిరుమ‌ల‌లోని అన్నమ‌య్య భ‌వన్‌లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రితో క‌లిసి జిల్లా, టీటీడీ అధికారుల‌తో శాఖ‌ల వారీగా స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు. శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాద‌శిని విజ‌య‌వంతం చేసిన స్ఫూర్తితో జ‌న‌వ‌రి 25వ తేదిన జ‌ర‌గ‌నున్న ర‌థ స‌ప్తమిని కూడా వైభ‌వంగా నిర్వహించాల‌ని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారుల‌ను ఆదేశించారు.

జిల్లా, పోలీసు, టీటీడీ అధికారులు, సిబ్బంది స‌మిష్టిగా కృషి చేయ‌డం వ‌ల్లే శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార ద‌ర్శనాలు విజ‌య‌వంతం చేశామ‌న్నారు ఈవో సింఘాల్. త‌ద్వారా భ‌క్తులు సంతృప్తి ప‌డేలా సౌక‌ర్యవంత‌మైన ద‌ర్శనం, మెరుగైన స‌దుపాయాలు క‌ల్పించామ‌ని తెలిపారు.

ర‌థ స‌ప్తమి రోజున శ్రీ‌వారి ఆల‌య నాలుగు మాడ వీధులు, క్యూలైన్లు, బ‌య‌ట...