Telangana,hyderabad, ఆగస్టు 21 -- రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ (ఫస్ట్ ఫేజ్) ప్రక్రియ షురూ అయింది. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్ట్ 28వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఆగస్ట్ 22 నుంచి 29 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఆగస్ట్ 25 నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఆగస్ట్ 30వ తేదీన ఫ్రీజింగ్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. సెప్టెంబర్ 2వ తేదీలోపు టీజీ ఐసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందే విద్యార్థులు... సెప్టెంబ్ర 2 నుంచి వెబ్ సైట్ ద్వారా రిపోర్టింగ్ చేయాలి. ఇందుకు సెప్టెంబర్ 5వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

సెప్టెంబర్ 8వ తేదీ నుంచి టీజీ ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవ...