Telangana, సెప్టెంబర్ 24 -- రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా పూర్తి అయింది. ఈ నేపథ్యంలో అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. స్పెషల్ ఫేజ్ ప్రవేశాలకు షెడ్యూల్ ను విడుదల చేశారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు.

టీజీ ఐసెట్ ప్రత్యేక విడత ప్రవేశాల్లో భాగంగా అక్టోబర్ 5వ తేదీన అర్హత కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నిర్దేశించిన కౌన్సెలింగ్ ఫీజును కూడా చెల్లించాలి. అక్టోబర్ 6వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఇక 6వ తేదీ నుంచే వెబ్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ గడువు అక్టోబర్ 7వ తేదీతో పూర్తి కానుంది. అక్టోబర్ 7వ తేదీనే ఫ్రీజింగ్ చేసుకోవచ్చు.

ఇక ఈ ఫేజ్ కింద అక్టోబర్ 10వ తేదీలోపు సీట్లను కేటాయిస్తారు. ఇదే రోజు ...