Telangana,hyderabad, సెప్టెంబర్ 20 -- రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. తాజాగా ఫైనల్ ఫేజ్ సీట్లను కేటాయించారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు టీజీ ఐసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ అర్డర్ కాపీలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

రాష్ట్రంలో మొత్తం 276 మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద 30,587 సీట్లు అందుబాటులో ఉన్నాయి.వీటిల్లో 26,131 సీట్లు భర్తీ అయ్యాయి. ఇక 79 కాలేజీల్లో 7,227 ఎంసీఏ సీట్లుండగా. 4,723 నిండాయి. మిగిలిన సీట్లు భర్తీ కావాల్సి ఉంది. వీటి భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇస్తారు.

టీజీ ఐసెట్ ఫైనల్ ఫేజ్ కింద సీట్లు పొందిన విద్యార్థులు... ఈనెల 20వ తేదీ నుంచి వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ...