భారతదేశం, సెప్టెంబర్ 28 -- గ్రూప్-2 ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. మెుత్తం 783 పోస్టులకు.. 782 మంది లిస్ట్ విడుదల చేసింది. ఒక్క పోస్ట్ ఫలితాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. 2024 డిసెంబర్‌లో రాత పరీక్ష జరిగింది.

కోర్టు ఆదేశాల అమలుపై ఈ ఎంపికలో ఏవైనా మార్పులు జరిగితే, అదే తదుపరిగా ఉంటుందని టీజీపీఎస్సీ తాజాగా స్పష్టం చేసింది. ఎవరైనా అభ్యర్థి తప్పుడు సమాచారాన్ని అందించారని లేదా ఏదైనా తప్పిదం కారణంగా పోస్ట్‌కు ఎంపికయ్యారని కమిషన్ దృష్టికి వస్తే వారిని ఎంపికకు సంబంధించి ఏ దశలోనైనా రద్దు చేయవచ్చని పేర్కొంది. నిబంధనల ప్రకారం, ఏదైనా చర్య తీసుకునే హక్కు కమిషన్‌కు ఉందని వెల్లడించింది.

గ్రూప్ 2 సర్వీసులకు సంబంధించి 18 కేటగిరీల్లో 783 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసె...