భారతదేశం, జనవరి 20 -- ఇటీవల టీజీఎస్ఆర్టీసీ పలు పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్టీసీలో ఖాళీగా ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 198 ఖాళీలున్నాయి.

ఈ పోస్టుల భర్తీ కోసం TSLPRB (తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన, ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 30వ తేదీ నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ గడువు జనవరి 20, 2026వ తేదీతో ముగుస్తుంది. అభ్యర్థులు http://tslprb.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవచ్చు.

ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ(84), మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ - 114 పోస్టులకు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత...