భారతదేశం, డిసెంబర్ 30 -- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ 198 పోస్టులకు రిక్రూట్‌మెంట్ చేస్తోంది. ఏదైనా గ్రాడ్యుయేట్, డిప్లొమా ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 30-12-2025న ప్రారంభమైంది. 20-01-2026న ముగుస్తుంది. అభ్యర్థులు www.tgprb.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

198 పోస్టుల్లో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ(టీఎస్టీ): 84, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ(ఎంఎస్టీ): 114 పోస్టులు ఉన్నాయి. జీతం నెలకు రూ.27,080 నుంచి రూ.81,400 మధ్య ఉంటుంది. టీఎస్టీకి డిగ్రీ, ఎంఎస్టీకి ఆటోమొబైల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా అర్హత ఉండాలి. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ రిక్రూట్‌మెంట్ చేస్తోంది. ర...