భారతదేశం, సెప్టెంబర్ 24 -- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో త‌మ సేవ‌ల‌ను మెరుగుప‌రుచుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ మరో అడుగు వేసింది. అన్ని ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​(ఏఐ)ను వినియోగించాలని నిర్ణయించింది. త‌మ ఉత్పాదకత పెంపు, సిబ్బంది ప‌నితీరు, ఆరోగ్య స్థితి పర్యవేక్షణ, ఖర్చుల తగ్గింపు, ర‌ద్దీకి అనుగుణంగా స‌ర్వీసుల‌ ఏర్పాటుతో పాటు సేవలను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. దేశంలోనే తొలిసారిగా ఏఐ వినియోగించిన ప్రజా ర‌వాణా సంస్థగా టీజీఎస్ఆర్టీసీ నిలిచింది.

ఏఐ ప్రాజెక్టు అమలుకు హన్స ఈక్విటీ పార్టనర్స్ ఎల్ఎల్‌పీ అనే సంస్థ టీజీఎస్ఆర్టీసీకి తోడ్పాటును అందిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, ప్రణాళికాబద్ధమైన అమలు వ్యూహాలను అందించి, అన్ని డిపోల్లో సులభంగా అమలు జరిగేలా ఆ సంస్థ సహకరిస్తోంది. ఏఐ వినియోగం కోసం ఒక స్పెషల్ టీంను యాజ‌మాన్యం ఏర్...