భారతదేశం, సెప్టెంబర్ 21 -- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పలు మౌలిక వసతులు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్డీఓ, ఏఎస్పీ కార్యాలయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు రూ.3.30 కోట్ల వ్యయంతో సిద్ధం చేసిన సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, మెటీరియల్ రికవరీ సెంటర్‌ను ప్రారంభించారు.

అలాగే 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.2.70 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న మల్లనూర్ జూనియర్ కళాశాల పనులకు భూమిపూజ చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు వీలుగా 15 మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను సీఎం జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అనంతర...