భారతదేశం, జనవరి 5 -- తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కల్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో కొత్త బ్యానర్‌ను ప్రారంభించారు నిర్మాత కల్యాణ్. వినూత్న కథలు, కొత్త దర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీనటులకు అవకాశాలు కల్పిస్తూ కొత్త తరహా సినిమాలను నిర్మించాలనే లక్ష్యంతో ఈ నిర్మాణ సంస్థ ముందుకు సాగుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తవాళ్లకు అవకాశాలు లభించడం కష్టంగా మారుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రతిభ ఉన్న వారికి సరైన వేదిక కల్పించాలనే ఉద్దేశంతో కల్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌ను స్థాపించినట్లు ప్రొడ్యూసర్ కల్యాణ్ తెలిపారు.

"కథే హీరో" అన్న సిద్ధాంతంతో, వినూత్న కథలు, సమకాలీన అంశాలు, ప్రేక్షకులను ఆలోచింపజేసే, అలరించే సినిమాలను నిర్మించడమే తమ లక్ష్యం అని నిర్మాత కల్యాణ్ తెలిపారు.

నిజమైన ప్రతిభకు సరైన వేదిక కల్పించాలన...