భారతదేశం, ఆగస్టు 8 -- భారత్, అమెరికా మధ్య సుంకాల వివాదం నడుస్తోంది. సుంకాల వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. సుంకాల వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని అన్నారు. ట్రంప్ ప్రభుత్వం భారత దిగుమతులపై సుంకాన్ని 50శాతానికి రెట్టింపు చేసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.

కొత్త 50 శాతం సుంకాల దృష్ట్యా చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని మీరు భావిస్తున్నారా? అని ఓవల్ కార్యాలయంలో వార్తా సంస్థ ఏఎన్ఐ అడిగినప్పుడు లేదు అని ట్రంప్ బదులిచ్చారు.

బుధవారం తెల్లవారుజామున భారత వస్తువులపై అదనంగా 25 శాతం సుంకం విధిస్తూ వైట్ హౌస్ కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేసింది. దీనితో మొత్తం సుంకం 50శాతానికి చేరుకుంది. రష్యా నుండి భారతదేశం చమురు కొనుగోలు చేస్తూనే ఉందని అమెరికా...