భారతదేశం, అక్టోబర్ 19 -- కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖకు చెందిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్) ఖతార్‌లో అర్హత కలిగిన నర్సింగ్ నిపుణులకు ఉపాధి అవకాశాలను ప్రకటించింది. హోమ్ కేర్ సేవలలో రోగులకు వృత్తిపరమైన సంరక్షణను అందించడానికి లైసెన్స్డ్ ప్రాక్టీషనర్ నర్సులు(LPN), నర్స్ టెక్నీషియన్ల పోస్టుల కోసం అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల కోసం టామ్‌కామ్ చూస్తోంది.

20 నుండి 40 సంవత్సరాల వయస్సు గల సంబంధిత క్లినికల్ నైపుణ్యాలు, చక్కటి ఆంగ్ల సంభాషణ సామర్థ్యాలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పదవికి నర్స్ టెక్నీషియన్‌లకు కనీసం ఒక సంవత్సరం అనుభవం, లైసెన్స్ పొందిన ప్రాక్టీషనర్‌లకు కనీసం రెండు సంవత్సరాల అనుభవం అవసరం ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థులకు అర్హత, అనుభవాన్ని బట్టి ఆకర్షణీయమైన జీతాలను చెల్లించనున్నారు. అభ్యర్థులక...