భారతదేశం, డిసెంబర్ 25 -- ఎస్‌యూవీల తయారీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా.. ఇప్పుడు తన పోర్ట్‌ఫోలియోను మరింత ఎక్స్​ప్యాండ్​ చేసే పనిలో పడింది. తన కొత్త 'ఎన్​యూ ఐక్యూ' అనే మల్టీ-ఎనర్జీ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఒక కొత్త ఎస్​యూవీని రూపొందిస్తోంది. దాని పేరు 'మహీంద్రా విజన్-ఎస్'. ఇదొక కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ మోడల్​ని త్వరలో ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది.

ఇటీవల ఈ కారు భారత రోడ్ల మీద టెస్ట్​ డ్రైవ్​ చేస్తూ కనిపించింది. ఈ స్పా షాట్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. టాటా సియెర్రాకి పోటీనిచ్చేందుకు రెడీ అవుతున్న ఈ విజన్​ ఎస్​కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

డిజైన్​ని చూస్తుంటే ఈ విజన్​-ఎస్​ మహీంద్రా స్కార్పియోకి బేబీ వర్షెన్​లా తలిపిస్తుంది. బాక్సీ షేప్, నిటారుగా ఉండే ఫ్రంట్ ఫాసియా, ఫ్లాట్ ...