భారతదేశం, మే 13 -- దేశీయ ఆటోమొబైల్ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న టాటా మోటార్స్, నాలుగో త్రైమాసికం (Q4FY26) ఫలితాల్లో అదరగొట్టింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే కంపెనీ నికర లాభం ఏకంగా 69.56 శాతం వృద్ధితో రూ. 2,406 కోట్లకు చేరుకుంది. బుధవారం విడుదల చేసిన ఈ ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను మించి ఉండటం విశేషం.

గతేడాది (మార్చి 2025 త్రైమాసికం) టాటా మోటార్స్ లాభం రూ. 1,419 కోట్లుగా ఉండగా, ఈసారి అది రూ. 2,406 కోట్లకు చేరింది. అయితే, అంతకుముందు త్రైమాసికం (Q3FY26) లో కేవలం రూ. 561 కోట్లుగా ఉన్న లాభం, ఈ మూడు నెలల్లో ఏకంగా నాలుగు రెట్లు పెరగడం కంపెనీ వ్యాపార సామర్థ్యానికి అద్దం పడుతోంది.

కంపెనీ ఆదాయం కూడా గతేడాది కంటే 22.3 శాతం పెరిగి రూ. 24,452 కోట్లుగా నమోదైంది. వస్తువుల తయారీ వ్యయం పెరిగినప్పటికీ, అమ్మకాలు భారీగా సాగడం మరియు ఖర...