భారతదేశం, నవంబర్ 4 -- దసరా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు దీక్షిత్ శెట్టి. దసరా తర్వాత దీక్షిత్ శెట్టి నటించిన సినిమా ది గర్ల్‌ఫ్రెండ్. ఈ సినిమాలో గర్ల్‌ఫ్రెండ్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, బాయ్‌ఫ్రెండ్‌గా అంటే హీరోగా దీక్షిత్ శెట్టి పర్ఫామెన్స్ చేశారు. ఇక ఈ సినిమాకు హీరో అండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు.

అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమా తెలుగు, హిందీలో నవంబర్ 7న.. తమిళం, మలయాళం, కన్నడలో నవంబర్ 14న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో హీరో దీక్షిత్ శెట్టి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.

-రష్మిక మందన్నా పర్‌ఫార్మెన్స్ చూశాక "ది గర్ల్‌ఫ్రెండ్" సినిమాకు మరో హీర...