భారతదేశం, ఆగస్టు 28 -- టయోటా ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి కొత్త కారును తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, త్వరలో సరికొత్త అర్బన్ క్రూయిజర్ ఈవీని విడుదల చేయనుంది. కొత్త కారు అంచనా ధర, ఫీచర్ల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం..

కొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ 2026 ప్రథమార్థంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. 18 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండవచ్చని అంచనా. దీని వలన వినియోగదారులు సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ సంవత్సరం జనవరిలో ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించారు. ఇది చాలా చక్కని డిజైన్‌ను కలిగి ఉంది.

కొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీలో ఎల్ఈడీ హెడ్‌లైట్లు, 12-పీస్ ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు, ఫాగ్ లైట్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, ఛార్జి...