భారతదేశం, సెప్టెంబర్ 22 -- ఆరోగ్యానికి పునాది సరైన నిద్ర అని ఆరోగ్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. కానీ నేటి జీవనశైలిలో చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. చాటింగ్, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం వల్ల రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోవడం లేదు. కానీ, నిద్ర లేమి మెదడుపై ఎంత భయంకరమైన ప్రభావం చూపుతుందో ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ ప్రశాంత్ కటకోల్ తాజాగా వెల్లడించారు. 30 ఏళ్ల అనుభవం ఉన్న ఈయన సెప్టెంబర్ 22న తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో నిద్ర లేమి, మద్యం వల్ల కలిగే నష్టాలను పోల్చుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

"మీరు మద్యం మెదడుకు చెడ్డది అనుకుంటే, మీ సరైన నిద్ర లేమి మరింత ప్రమాదకరం" అని ఆయన హెచ్చరించారు.

మద్యం సేవించినప్పుడు ఎలా అయితే మైకంగా, తలతిరిగినట్లు ఉంటుందో, సరిగ్గా నిద్రపోకపోతే కూడా అదే అనుభూతి కలుగుతుందని డాక్టర్ ప్...