జొన్నగిరిలో ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి చేయడం టార్గెట్ : సీఎం చంద్రబాబు
భారతదేశం, జూన్ 24 -- జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి వద్ద దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బంగారు గని ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగారం శుద్ధి కర్మాగారాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జియో మైసూర్ సర్వీసెస్', 'త్రివేణి ఎర్త్ మూవర్స్' సంస్థల యాజమాన్యాలను, కార్మికులను సీఎం చంద్రబాబు అభినందించారు.
జొన్నగిరి ప్రాంతానికి వందల సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. 'పూర్వం అశోక చక్రవర్తి పరిపాలించిన నాలుగు ప్రధాన రాజధానులలో ఒకటైన 'సువర్ణగిరి'.. నేటి జొన్నగిరి. ఇక్కడికి సమీపంలో లభించిన అశోకుడి ఎర్రగుడి శాసనాలే అందుకు నిదర్శనం. ఒకప్పుడు బంగారం, రత్నాలతో విలసిల్లిన ఈ ప్రాంతం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.