భారతదేశం, సెప్టెంబర్ 16 -- భారత బలగాలు చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబం ఛిన్నాభిన్నమైందని ఆ సంస్థ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ స్వయంగా అంగీకరించారు. ఈ ఆపరేషన్‌లో భారత్.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై కచ్చితత్వంతో దాడులు నిర్వహించింది. అజహర్ కుటుంబం పూర్తిగా నాశనమైందని ఆయన తీవ్ర భావోద్వేగంతో వెల్లడించాడు.

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోలో మసూద్ ఇలియాస్ కాశ్మీరీ మాట్లాడుతూ, "మేం ఉగ్రవాదాన్ని స్వీకరించి, మా సరిహద్దులను కాపాడటానికి ఢిల్లీ, కాబూల్, కందహార్‌లలో పోరాడాం. మేం అన్నీ త్యాగం చేశాక, మే 7న బహావల్‌పూర్‌లో మౌలానా మసూద్ అజహర్ కుటుంబాన్ని భారత బలగాలు ఛిన్నాభిన్నం చేశాయి" అని ఆవేదన వ్యక్తం చేశాడు.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పౌరులను బలి తీసుకున్న ఉగ్రదాడి తర్వాత ...