భారతదేశం, ఆగస్టు 21 -- రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బగ్రూ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాంపురా కన్వర్‌పురా గ్రామంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాల దుస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కో-కన్వీనర్ అశుతోష్ రాంకా, పార్టీ వాలంటీర్లపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక పార్టీ కార్యకర్త చేయి విరిగినట్లు నాయకులు తెలిపారు.

రాంపురా కన్వర్‌పురాలోని పాఠశాల ప్రధాన భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో, దానిని కూలిపోకుండా ఇనుప యాంగిళ్లతో నిలబెట్టారు. భవనం ప్రమాదకరంగా మారడంతో మూసివేసి, సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న రేకుల షెడ్‌లోకి విద్యార్థులను తరలించారు. ఆ షెడ్‌లో పశువుల మేత పడి ఉండటంతో పాటు, నిర్మాణం నుండి ఇటుకలు రాలిపడుతుండటంతో పిల్లలు భయం గుప్పెట్లో చదువుకుంటున్నారు. ఈ దారుణ...