భారతదేశం, జూన్ 18 -- ఇంజనీరింగ్ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి, ఉన్నత విద్యా అవకాశాలను కల్పించే లక్ష్యంతో విజయనగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-గురజాడ (JNTU-GV) ఒక కీలక ప్రకటన చేసింది. ప్రముఖ జర్మనీ విశ్వవిద్యాలయంతో కలిసి అందిస్తున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించింది.

జేఎన్‌టీయూ-గురజాడ (JNTU-GV) 2026-27 విద్యాసంవత్సరానికి గానూ 'ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ ప్రోగ్రామ్' (IIBMP) ప్రవేశాల ప్రకటనను అధికారికంగా విడుదల చేసింది. జర్మనీలోని ప్రముఖ రాయిట్లింగెన్ విశ్వవిద్యాలయం పరిధిలోని నాలెడ్జ్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ వినూత్న కోర్సును రూపొందించారు.

ఈ అంతర్జాతీయ విద్యా ఒప్పందం ప్రకారం.. విద్యార్థులు తమ విద్యాసంవత్సరాల కాలపరిమితిలో ఒక భాగాన్ని విజయనగ...