భారతదేశం, ఆగస్టు 13 -- బంగారం అంటే కేవలం పెళ్లిళ్ల కోసమో, పండుగల కోసమో మాత్రమే అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు జెన్- జీ (Gen Z) యువత తమ అమ్మమ్మ, అమ్మల నగలను వెతికి మరీ పట్టుకుంటున్నారు. సంప్రదాయ నగలంటే ఒకప్పటిలా భారీగా, మెడ నిండా వేసుకోవడం కాదు... ఒక్కో నగను ఒక్కో ప్రత్యేకతగా ధరిస్తున్నారు. అద్భుతమైన కళానైపుణ్యం, చరిత్ర ఉన్న ఈ నగలను ఆధునిక దుస్తులతో కలిపి సరికొత్త ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మారుస్తున్నారు. డ్రెస్సుల నుంచి సూట్ల వరకు... దేనితోనైనా కలుపుతున్నారు.

ఈ సరికొత్త ఫ్యాషన్ పోకడపై తనిష్క్ (Tanishq) సంస్థ డిజైన్ హెడ్ గరిమా మహేశ్వరితో హెచ్‌టీ లైఫ్‌స్టైల్ (HT Lifestyle) సంభాషించింది. ఫాస్ట్ ఫ్యాషన్‌కు విసిగిపోయిన భారతీయ యువత, తమ సంప్రదాయ ఆభరణాలను ఒక తిరుగుబాటులా ఎందుకు ధరిస్తున్నారో ఆమె వివరించారు.

సమాజంలో ఫాస్ట్ ఫ్యాషన్, అందరూ ఒకేలా ఉండ...