Pulivendula,andhrapradesh, ఆగస్టు 9 -- ఏపీలోని పులివెందులలో పొలిటికల్ హీట్ రోజురోజుకూ మరింత పెరుగుతోంది. జెడ్పీటీసీ ఉప ఎన్నిక గడువు దగ్గరపడుతున్న వేళ.. నువ్వా నేనా అన్నట్లు వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ నుంచి మంత్రులు, వైసీపీ నుంచి కీలక నేతలు ఇంటింటా ప్రచారం చేపడుతున్నారు. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నిక జరుగుతుండటంతో రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ప్రచారంలో భాగంగా ఇటీవలనే టీటీడీ, వైసీపీ నేతల మధ్య దాడులు జరిగాయి. వైసీపీ ఎమ్మెల్సీపై కూడా దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ఉపఎన్నిక జరుగుతున్న ప్రాంతంలో పోలీసులు బలగాలను మోహరించారు. ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వై...