భారతదేశం, జూలై 24 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. జులై 22, 23 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసినప్పటికీ, తీవ్రమైన వర్షపాత లోటుపై అవి ఎలాంటి సానుకూల ప్రభావాన్ని చూపలేకపోయాయి. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం జులై 23 నాటికి రాష్ట్రంలో మొత్తం వర్షపాత లోటు ఏకంగా 53.3 శాతానికి చేరుకుంది.

రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల్లో ఒక్క ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా మినహా, 27 జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. అనేక జిల్లాల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది. తీవ్ర లోటు ఉన్న జిల్లాలు విశాఖపట్నం, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో వర్షపాత లోటు 60 శాతం నుండి 76 శాతం వరకు ఉంది. వీటిని త...