జూలై 15 లోపు ఇంద్రకీలాద్రిపై నూతన అన్నదానం భవన్, ప్రసాదాల తయారీ కేంద్రం ప్రారంభం
భారతదేశం, జూన్ 22 -- ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి భక్తులకు దేవాదాయ శాఖ తీపి కబురు అందించింది. కొండపై నూతనంగా అత్యాధునిక వసతులతో నిర్మించిన అన్నదానం భవన్, ప్రసాదాల తయారీ కేంద్రం (పోటు) ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రాబోయే జూలై 15వ తేదీ లోపు ఈ భవనాలను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు.
దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ ఇంద్రకీలాద్రిపై సుడిగాలి పర్యటన చేశారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. దుర్గగుడి ఈవో, ఇంజనీరింగ్ అధికారులు, పాలకమండలి సభ్యులతో కలిసి కమిషనర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్దేశిత గడువులోగా పనుల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.