భారతదేశం, సెప్టెంబర్ 14 -- జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయని అందరూ భావిస్తున్నారు. భారత ఎన్నికల సంఘం బీహార్ రాష్ట్ర ఎన్నికలతో పాటు అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ ప్రారంభంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను షెడ్యూల్ చేస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. దీంతో నవంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది.

గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి గతంలో నిర్ణయించిన సెప్టెంబర్ 30 గడువును పొడిగించాలని కోరుతూ ప్రభుత్వం వచ్చే వారం హైకోర్టును ఆశ్రయించడానికి ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ అంశంపై ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం కోసం వేచి ఉన్నాయి. కోటా అ...