Telangana,hyderabad, సెప్టెంబర్ 26 -- జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్‌ పేరు ఖరారైంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

గత అసెంబ్లీ ఎన్నికలో ఇక్కడ్నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ గెలిచారు. అనారోగ్యంతో ఆయన ఇటీవలే మృతి చెందటంతో ఇక్కడ ఉపఎన్నిక రానుంది. దీంతో ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవటం బీఆర్ఎస్ సవాల్ అనే చెప్పొచ్చు. ఇప్పటికే కమిటీలను కూడా ఏర్పాటు చేసి. ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ.. పక్కా వ్యూహాలతో ముందుకెళ్లే పనిలో పడింది.

ఈ ఉపఎన్నిక కోసం ఎవర్నీ అభ్యర్థిగా నిలపాలనే విషయంపై బీఆర్ఎస్ బాగానే కసరత్తు చేసింది. పార్టీకి చెందిన పీజేఆర్ కుమారుడైన విష్ణువర్థన్ రెడ్డితో పాటు రావుల శ్రీధర్ రెడ్డి పేర్లను పరిశీలించింది. అంతేకాకుండా మాజీ మంత్రి ...