Telangana,hyderabad, అక్టోబర్ 1 -- త్వరలోనే జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నికలు జరగనున్నాయి. మాగంటి గోపినాథ్ మృతితో ఈ స్థానానికి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏ క్షణమైనా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం.. తాజాగా తుది ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది.

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నారు. సవరణల తర్వాత జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. 6,106 మంది యువ ఓటర్లు (18-19 సంవత్సరాలు), 2,613 మంది వృద్ధులు (80 ఏళ్లు పైబడిన వారు), 1,891 మంది దివ్యాంగులు ఉన్నారు. మొత్తం 139 కేంద్రాల్లో 409 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

తుది ఓటర్ల జాబితా ఖర...